యలమంచిలి : కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాలు తెల్లవారు 4 గంటలు నుండి భక్తులతో కిటకిట లడాయి. పట్టణంలో కొత్తపేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మెయిన్ రోడ్లో త్రినాధ స్వామి ఆలయం, బైపాస్ రోడ్ లో సోమస్కంద స్వామి ఆలయం, శేషు గడ్డ వద్ద ఉజ్జయిని స్వామి ఆలయం, సోమలింగపాలెం సోమేశ్వర స్వామి, ఏటికొప్పాక కాత్యాయిని సమేత ఓంకారేశ్వర స్వామి, తెరువుపల్లి శ్రీ ఉమామహేశ్వర రత్నాకర స్వామి, కొత్తపాలెం కాశీ విశ్వేశ్వర స్వామి, కట్టు పాలెం శివాలయం తదితరాలయాల్లో భక్తులు వందల సంఖ్యలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.