జాతీయ స్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు యలమంచిలి విద్యార్థి యశ్వంత్ ఎంపిక..
16/November/2026 22:45
Share:
యలమంచిలి : పట్టణంలోని సెయింట్ జూడ్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎన్. యశ్వంత్ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-14 వాలీబాల్ జట్టులో యశ్వంత్ స్థానం సంపాదించుకోవడం పట్ల పాఠశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం రిక్కీ విద్యార్థి యశ్వంత్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర జట్టు తరపున జాతీయ స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.