యలమంచిలి వాగ్దేవి కళాశాలలో ఘనంగా జాతీయ పత్రిక దినోత్సవం..
16/November/2026 22:41
Share:
యలమంచిలి : జాతీయ పత్రికా దినోత్సవం ను పురిష్కరించుకొని సోమవారం యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో ఘనంగా జాతీయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సోమేశ్వరరావు, రిటైర్డ్ అధ్యాపకులు ఆడారి పూరీ జగన్నాథం, ప్రముఖ న్యాయవాది కూనిశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిలో రాణించాలని, వారి రక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు సింహాచలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మెళ్ల గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమాన్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కిషోర్, ఎలక్ట్రాన్ మీడియా సహాయక కార్యదర్శి సిహెచ్ సంతోష్ కుమార్, సహా కార్యదర్శి పిల్లా లోకేష్, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షుడు అప్పికొండ గణేష్, అధ్యక్షులు చిన్నాజి, కార్యదర్శి ధర్మిరెడ్డి అప్పలనాయుడు, కోశాధికారి నానేపల్లి సన్యాసిరావు, సభ్యులు రాజాన నాయుడు, మల్ల రాము, ప్రెస్ క్లబ్ సభ్యులు సత్యనారాయణ, డి సుబ్బరాజు, రాజు, శివ, నూకరాజు, రఘు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.