పంచాయతీ ఎన్నికల బరిలోకి కూటమి మద్దతుదారులు.. నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీనాయన
బొబ్బిలి, నవంబర్ :
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో బొబ్బిలి నియోజకవర్గంలో ఎన్నికల సందడి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతుతో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీనాయన) పలు గ్రామాల్లో జరిగిన నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపారు.మెట్టవలస, పారాది, దిబ్బగుడివలస, సీతయ్యపేట, కింతలవానిపేట, కోమటిపల్లి, ఎం.బూర్జవలస, నారాయణప్పవలస గ్రామ పంచాయతీలకు చెందిన అభ్యర్థులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్
మందపాటి సూర్యనారాయణ రాజు