పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం 

పేకాట స్థావరంపై దాడి: ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం 

13/September/2026 20:14    Share:   

బుచ్చయ్యపేట, సెప్టెంబర్ 12: ​కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు.
​శనివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా కాసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
​వారి వద్ద నుంచి రూ.9,060/- నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. 
నిందితులను అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
​మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
Breaking News

Subscribe our Newsletter