చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం

చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం

14/November/2026 21:35    Share:   

రాజాం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో కీలక భేటీ
* సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు గెలుపు వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం
* సమన్వయంతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని శ్రేణులకు పిలుపు

చీపురుపల్లి,నవంబర్14:

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారు రాజాం క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు, ఎంపీపీ దన్నాన రామచంద్రుడు,, జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, టౌన్ అధ్యక్షులు గవిడి నాగరాజు, ముళ్ళు రమణ, ఇజ్జురోతు రాంబాబు, రౌతు నారాయణ రావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు గారు మాట్లాడుతూ, చీపురుపల్లి మేజర్ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు గారి విజయానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. వార్డుల వారీగా ఎన్నికల ప్రచార సరళి, ఓటర్ల మద్దతు మరియు క్షేత్రస్థాయి పరిస్థితులపై నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందేలా సమన్వయంతో పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
  • S A N RAJU cheepurupalli
Breaking News

Subscribe our Newsletter