అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ నిరసన
ఎలమంచిలి, ఆగస్టు 28 — ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను తక్షణమే రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎలమంచిలి న్యాయవాదుల బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విధులను బహిష్కరించారు.
న్యాయవాదుల గౌరవం, భద్రత మరియు న్యాయవాద వృత్తి రక్షణ కోసం రాజస్థాన్, కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
విధుల బహిష్కరణపై మాట్లాడుతూ, శుక్రవారంతో పాటు సోమవారం కూడా తమ విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. సందర్భంగా న్యాయవాదులు తమ నిరసనను వినిపించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలమంచిలి న్యాయవాదుల డిమాండ్‌ను పరిష్కరించాలని, కోర్టు ఆవరణలో తమ వృత్తిపరమైన భద్రతకు హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.