శ్రీ కంచమ్మ తల్లి కొండ జాతర అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ బొత్స సందీప్,

శ్రీ కంచమ్మ తల్లి కొండ జాతర అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ బొత్స సందీప్,

14/November/2026 06:19    Share:   

కొండలావేరులో వైభవంగా శ్రీ కంచమ్మ తల్లి కొండ జాతర
అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ బొత్స సందీప్, ప్రముఖులు

కొండలావేరు, నవంబర్ (క్రైమ్ ఎనాలసిస్):

విజయనగరం జిల్లాలో కొండలావేరు గ్రామంలో కొలువైన శ్రీ కంచమ్మ తల్లి కొండ జాతర భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరె, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాలు, భక్తి గీతాల నడుమ గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఈ జాతర మహోత్సవంలో డాక్టర్ బొత్స సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేయించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జాతరను ఇంత వైభవంగా నిర్వహిస్తున్న గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ టి. వేణు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎస్.వి. రమణరాజు, కృష్ణమూర్తి రాజు, కిరణ్ రాజు, సూర్యరాజు, ఏ. నాగరాజు, పి. కృష్ణ, ఎస్. రమేష్ తదితర ప్రముఖులు, నాయకులు పాల్గొని కంచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు, యువకులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

గ్రామ దేవత అయిన కంచమ్మ తల్లి కొండ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడం విశేషం. అమ్మవారి కృపతో పంటలు బాగా పండి, గ్రామం సుభిక్షంగా ఉంటుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.

-- క్రైమ్ ఎనాలసిస్, విజయనగరం జిల్లా ఇంచార్జ్, మందపాటి సూర్యనారాయణ రాజు

Breaking News

Subscribe our Newsletter