విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్..

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఏఐఎస్ఎఫ్..

20/August/2026 20:25    Share:   

అనకాపల్లి:
విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ఎర్రజెండాలు, ప్లకార్డులు చేతబట్టి విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల భారాన్ని తగ్గించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వసతి, స్కాలర్‌షిప్‌లు తదితర సౌకర్యాలను సకాలంలో అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్
Breaking News

Subscribe our Newsletter