రైతుల పొలాలను సందర్శించిన ఏఎన్జీఆర్‌ఏయూ వీసీ డా. పి.వి. సత్యనారాయణ

రైతుల పొలాలను సందర్శించిన ఏఎన్జీఆర్‌ఏయూ వీసీ డా. పి.వి. సత్యనారాయణ

10/November/2026 17:35    Share:   

యలమంచిలి, నవంబర్ 9:

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ వైస్ ఛాన్సలర్ ఆచార్య డా. పి.వి. సత్యనారాయణ నవంబర్ 9వ తేదీన యలమంచిలి మండలంలోని తురంగరపాలెం గ్రామంలో పలు రైతుల పొలాలను సందర్శించి, పంటల సాగు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

క్షేత్ర పరిశీలనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు

ఈ కార్యక్రమంలో అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అనకాపల్లి డా. ముకుందరావు, ప్రధాన శాస్త్రవేత్తలు డా. ఉమామహేశ్వరరావు, డా. చంద్రశేఖర్, వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డా. ఎం.బి.జి.ఎస్. కుమారి, మండల వ్యవసాయాధికారి మోహన్ రావు పాల్గొన్నారు.

రైతులతో ముఖాముఖి

ఈ సందర్భంగా వీసీ రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల సాగులో ఇబ్బందులు, వ్యవసాయ అవసరాలు మరియు వాటి పరిష్కార మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు విశ్వవిద్యాలయం తరఫున అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు.

ముంపు వరికి ఎరువుల యాజమాన్యంపై సూచనలు

అర్ణబ్ సైక్లోన్ దృష్ట్యా వరి నాట్లు వేసిన 35 నుంచి 40 రోజుల పొలాలు 4 నుంచి 5 రోజులు నీట మునిగాయని, కావున వాటికి అనుగుణంగా ఎకరాకు 25 కిలోల యూరియా మరియు 10 కిలోల పొటాష్ వేసి, మరల 10 రోజుల తర్వాత మరోసారి 25 కిలోల యూరియా + 10 కిలోల పొటాష్ రెండు దఫాలుగా వేసుకున్నట్లయితే దిగుబడిలో ఎటువంటి లోపం లేకుండా ఉంటుందని రైతులకు సూచించారు.

ముంపును తట్టుకునే వరి రకాలు

RGL 2537 మరియు ఇంద్ర, అమర వంటి వరి రకాలు చౌడు మరియు నీటి ముంపును పది రోజుల వరకు తట్టుకునే రకాలని, వీటిని వేసుకోవడం వల్ల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు.

పరిశోధనా స్థానం సందర్శన

అనంతరం యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించి, నూతన భవన ప్రారంభోత్సవానికి సంబంధించి పలు సూచనలు, సలహాలు అందించారు. భవనంలో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు, కార్యాలయ వసతులు మరియు పరిశోధనా కార్యకలాపాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి లోకేష్, వ్యవసాయ సహాయకులు దీపిక, రైతులు వెంకటరమణ, తోట ప్రసాద్, కౌన్సిలర్ బెజవాడ మణి, బెజవాడ చిరంజీవి, మరిడయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబురావు, బత్తిని రమేష్ మరియు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter