శామలింగాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణకుమారి నామినేషన్.
24/October/2026 07:17
Share:
=వైఎస్సార్‌సీపీ శ్రేణుల సమక్షంలో నామినేషన్ దాఖలు శామలింగాపురంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా అరుణకుమారి నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శిరువూరి వెంకటరమణ రాజు, సన్‌రైజ్ స్కూల్ యాజమాన్యం ఎ. నాగరాజు, మాజీ ఆర్‌సీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. కృష్ణమూర్తి రాజు, యువనాయకుడు ఎస్ కిరణ్ తదితరులు హాజరై అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.