రాంబిల్లిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గానగల్ల కోదండరావు నామినేషన్

రాంబిల్లిలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా గానగల్ల కోదండరావు నామినేషన్

23/October/2026 20:18    Share:   

CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్ 
 
రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామానికి చెందిన గానగల్ల కోదండరావు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మద్దతుదారులు ఆయనకు మద్దతు తెలిపారు.కోదండరావు మాట్లాడుతూ, ఎంపీటీసీగా అవకాశం కల్పిస్తే మండలంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, విద్యా, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.
రాంబిల్లి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో రాజకీయ సందడి నెలకొంది. వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Breaking News

Subscribe our Newsletter