
పూసపాటిరేగ : పూసపాటిరేగ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బొత్స చైతన్య బరిలోకి దిగుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచిన అభ్యర్థిగా, పెద్దలు, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆశీస్సులతో బొత్స లక్ష్మణరావు తనయుడు బొత్స చైతన్య పోటీ చేయనున్నారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా, మండలంలో విస్తృత ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు.