అచ్యుతాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి : రైతు సంఘం ధర్నా

అచ్యుతాపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి : రైతు సంఘం ధర్నా

16/October/2026 19:39    Share:   

అచ్యుతాపురం :

ఎల్-నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అచ్యుతాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సంవత్సరం రుతుపవనాలు సక్రమంగా లేకపోవడం వల్ల మండలంలో వరి, అపరాలు, జీడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి ఎద్దడి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20,000 పరిహారం ఇవ్వాలని, రైతు రుణాలను వాయిదా వేసి వడ్డీ మాఫీ చేయాలని, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు, సీఐటీయూ మండల కన్వీనర్ కె. సోమునాయుడు, నిర్వాసితుల సంఘం నాయకులు బుద్ధ రంగారావు, పంచదారల అప్పలరాజు, రెడ్డి అప్పారావు, ఈగల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter