వృద్ధురాలి బంగారం దోపిడీ కేసులో మహిళను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
14/October/2026 06:20
Share:
- నిందితురాలు అరెస్ట్ - ప్రైవేట్ స్కూల్ ఉద్యోగినిగా గుర్తింపు
యలమంచిలి : పట్టణములో సంచలనం రేపిన 80 ఏళ్ల వృద్ధురాలిపై కారం దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ రావు పట్టణ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలిపిన వివరాలు ప్రకారం మూడున్నర తులాల బంగారు గొలుసు దోపిడీకి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళగా గుర్తించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్ రావు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితురాలి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సావిత్రి, సిబ్బంది పాల్గొన్నారు.