ఆహ్వాన పత్రాన్ని అందజేసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
భువనేశ్వర్, అక్టోబర్ 13:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకావాలని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంగళవారం భువనేశ్వర్‌లోని ఒడిశా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మోహన్ చరణ్ మాఝీని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేసి, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌కు ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్.ఏ.ఎన్. రాజు