స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

స్థానిక ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

12/October/2026 07:24    Share:   

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ పి.వి. నరసింహారావు
అనకాపల్లి, 
రానున్న స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్‌డివిజన్ డీఎస్పీ పి.వి. నరసింహారావు ఆదివారం అనకాపల్లి మండలంలోని రేబాక, కోడూరు గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 29 పంచాయతీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రహరీ గోడలు, మౌలిక సదుపాయాలు, ఓటర్లకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించి, లోపాలను గుర్తించారు.
ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు. గుర్తించిన లోపాలను సరిచేయాలని ఎంపీడీఓకు సూచించారు.
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.

క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ
Breaking News

Subscribe our Newsletter