ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి,

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి,

11/October/2026 15:33    Share:   

 తిమ్మరాజుపేటలో కాకడాలు ప్రదర్శన 

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల రద్దుకు వ్యతిరేకంగా ఎన్నికల ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని తిమ్మరాజుపేటలో కాగడాలతో  నిరసన కార్యక్రమం జరిగింది. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కర్రీ అప్పారావు అధ్యక్షానా ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు  కాంగ్రెస్ పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి  తనకాల అనంతరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో 13 కోట్ల మందిని ఓటర్ల లిస్టు నుండి తొలగించారని పేద, కార్మికులు ,మైనార్టీలు, వలస కార్మికులు మరియు మహిళలు ఓట్లు దీనిలో ఉన్నాయని మన రాష్ట్రంలో సుమారు 45 లక్షల మందిని తొలగించారని వారు ఓటు హక్కును తిరిగి వెంటనే పునరుద్ధరించాలని పోరాడి సాధించుకున్న ఓటు హక్కును 18 ఏళ్లు దాటిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ ముగ్గురిలో ముఖ్య కమిషనర్ ఏకపక్షంగా బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా బిజెపి వ్యతిరేక ఓట్ల తొలగించారని దీనిపై 13 సార్లు మరో ఇద్దరు కమీషనర్లు పార్లమెంటరీ కమిటీకి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని వీటిపై విచారణ జరిపి ప్రధాన ఎన్నికల కమిషనర్ను వెంటనే విధులను తొలగించి అందరికీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సిఐటియు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు, తిమ్మరాజుపేట సిపిఎం శాఖ కార్యదర్శి సరిగడం రామనాయుడు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు బి రామకుమార్, బి రంగారావు, ఎస్ రామ్ సదాశివ  జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter