స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలలో ప్రైవేటీకరణ తగదు ..
13/July/2026 20:26
Share:
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలను ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జి ఒ నెంబర్ 396 నిర్ణయం సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు అన్నారు ప్రభుత్వం నిర్ణయం మూలంగా ప్రజల యొక్క స్థిరాస్తులు విషయం వ్యక్తిగత భద్రతకు పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు ప్రభుత్వ ఈ నూతన విధానం వలన రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖ కార్యాలయం వద్ద ప్రజలకు వాళ్ళు సేవలు అందిస్తూ తమ జీవనం సాగించే వేలాది మంది తమ జీవనాధారం కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హరినాథ్ బాబు డిమాండ్ చేశారు