జంపాపాలెంలో  

జంపాపాలెంలో  'పల్లె నిద్ర' కార్యక్రమం.. 

10/October/2026 07:12    Share:   

నేరాల నియంత్రణ, ఎన్నికలపై అవగాహన

యలమంచిలి :
మండలంలోని​జంపాపాలెం గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా జంపాపాలెం గ్రామంలో 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రూరల్ ఎస్ఐ ఉపేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖ స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు. ​ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ ఉపేంద్ర మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రజల పాత్ర కీలకమని, పోలీసులకు స్థానికులు ఎల్లప్పుడూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించినా, అనవసర వివాదాలు సృష్టించినా లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత, మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నిరోధక చట్టాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు. గ్రామంలో ఏవైనా అనుమానాస్పద సంఘటనలు లేదా అక్రమాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి వివాదాలు, ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు గ్రామస్తులతో పాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులకు, అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
Breaking News

Subscribe our Newsletter