విజయనగరం పార్లమెంటు అభివృద్ధి చర్చ..న్యూఢిల్లీ, అక్టోబర్ 9:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయనగరం పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంటు పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం కల్పించాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అంశాలపై దృష్టి సారించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ భేటీ ద్వారా విజయనగరం పార్లమెంటు పరిధిలోని అభివృద్ధి అంశాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్
మందపాటి సూర్యనారాయణ రాజు