పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని పరిశీలించిన అధికారి మోహన్ రావు

పొలంలో వరి నాట్లు వేసే విధానాన్ని పరిశీలించిన అధికారి మోహన్ రావు

07/October/2026 22:03    Share:   

రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

​యలమంచిలి :

  • మండలంలో తక్కువ వర్షపాతం నమోదు కావడం, సరైన నీటిపారుదల వసతి లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు నిండటంతో రైతులు సాగు పనులు వేగవంతం చేశారు. నీరు అందుబాటులోకి రావడంతో పల్లపు భూముల్లో దాదాపు 65 రోజుల వయస్సు ఉన్న ముదిరిన నారుముళ్లను రైతులు నాట్లు వేస్తున్నారు. ​ఈ నేపథ్యంలో పులపర్తి గ్రామంలో మల్లపరెడ్డి గోవింద్ పొలంలో నాట్లు వేసే విధానాన్ని మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు పరిశీలించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ముదిరిన నారు వేసిన పొలాల్లో మొక్కలు దగ్గరగా నాటుకోవాలని రైతులకు సూచించారు. ముదిరిన నారు వేసిన పొలాలకు ఎకరానికి అదనంగా 25 కేజీల యూరియాను వేసుకోవాలని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల పొలాల్లో దోమ, పొడ తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక దశలోనే ఎసిఫేట్, హెక్సాకొనజోల్ మందులను పిచికారీ చేయడం ద్వారా తెగుళ్లను అరికట్టవచ్చని సూచించారు. పంట వేయకుండా మిగిలి ఉన్న భూముల్లో రాగులు, జనుము, ఉలవలు వంటి ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవడానికి ప్రభుత్వం 80 శాతం రాయితీపై విత్తనాలను అందిస్తోందని, ఇవి స్థానిక రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ సహాయకురాలు హేమ, ఏపీ సి.ఎన్.ఎఫ్ సిబ్బంది వనజ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter