రూ.136 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుగరివిడి, సెప్టెంబర్ 30:
గరివిడి మండలంలోని ఇప్పలవలస గ్రామ ప్రజల చిరకాల రహదారి సమస్య పరిష్కారం దిశగా అడుగు పడింది. ఇప్పలవలస జి.జి. రోడ్డు నుంచి రెగటి మీదుగా ఇప్పలవలస వరకు రహదారి అభివృద్ధి పనులకు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు.రూ.136 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే ఇప్పలవలస, రెగటి పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. విద్యార్థులు, రైతులు,వ్యాపారులు,ఉద్యోగులు,స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు కూడా మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని,ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు.నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్సీ ఏం రాజు