శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..!!
క్రైమ్ అనాల్సిస్ : టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ ) :
యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి రూరల్ సి.ఐ.తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, అనవసర వివాదాలు సృష్టించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మహిళలు మరియు బాలలపై జరిగే నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు లేదా నేరాలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ సంఘటనలు, ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా గ్రామస్తులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులకు మరియు సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.ప్రజలతో మమేకమై.. సమస్యలను తెలుసుకుంటూ.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది.