విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం..

విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం..

20/September/2026 20:58    Share:   

రణస్థలం, సెప్టెంబర్ 20:
విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ కిమిడి నాగార్జున అధ్యక్షతన పార్లమెంటరీ ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రంలోని విజయనగరం ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు, శాసనసభ్యులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు, శ్రీ కోండ్రు మురళీమోహన్, శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, శ్రీ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన), ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ లంక శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం, పార్టీ బలోపేతం, కూటమి పార్టీల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమష్టి కృషితో ముందుకు సాగాలని నిర్ణయించారు.
అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో స్థానిక ఎమ్మెల్యే శ్రీ నడికుదుటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ శ్రీ విశ్వక్సేన్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

క్రైమ్ అనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter