యలమంచిలి పురపాలక ఎన్నికలపై సమీక్ష, సమావేశం

యలమంచిలి పురపాలక ఎన్నికలపై సమీక్ష, సమావేశం

19/September/2026 17:41    Share:   

- రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మక దిశానిర్దేశం
యలమంచిలి : పట్టణంలో గల వీరన్న కాంప్లెక్స్, శుభం కళ్యాణ మండపంలో టౌన్ ప్రెసిడెంట్ గొర్ల శివ నారాయణమూర్తి (నానాజీ) అధ్యక్షతన యలమంచిలి మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ పప్పలు చలపతిరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, ఎక్స్ ఎమ్మెల్సీ, రాష్ట్ర పార్లమెంటరీ పార్టీ ఎలక్షన్స్ ఇంచార్జ్ కొండపల్లి అప్పలనాయుడు, ఉభయగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ, నియోజకవర్గ పరిశీలకులు పేరాబత్తుల రాజశేఖరం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవాని భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బత్తుల తాతయ్య బాబు, కొండపల్లి అప్పలనాయుడు, పేరాబత్తుల రాజశేఖరం ని ప్రగడ నాగేశ్వరరావు చిరు సన్మానంతో సత్కరించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టౌన్ ప్రెసిడెంట్ నానాజీ మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని మేము తప్పక పాటిస్తామని కాకపోతే రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందిగా కోరారు. సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కార్యకర్త లకు, నాయకులకు వాళ్లకు రేపు మున్సిపల్ ఎలక్షన్ లో సీట్లు కేటాయించడం జరుగుతుంది అని తెలిపారు. కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ కార్యకర్త కోసం పనిచేసే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని, సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలని సీటు రాని వాళ్ళు నిరాశ చెందకూడదని, కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కార దిశగా మేము అధిష్టానానికి తెలిపి సమస్యలు పరిష్కరిస్తామని, కొన్ని సందర్భాల్లో పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కార్యకర్త ఇబ్బంది పడిన ఆలస్యమైన వాళ్లకి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ధర్మాన్ని పాటిస్తూ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న విధంగా మన అభ్యర్థులను గెలిపించుకోవాలి అని తెలిపారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ రాజశేఖర్ తెలిపారు. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన కార్యకర్తకు, నాయకులకు మన తెలుగుదేశం పార్టీ ఎన్నడు అండగా ఉంటుందని చెప్పేసి అని అన్నారు. భవాని మాట్లాడుతూ రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని ఐక్యమత్యంగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మున్సిపాలిటీలో 32 వార్డులకు కౌన్సిలర్ గా నిలబడేందుకు ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా పరిశీలించడం జరిగిందని తెలిపారు. అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి నిలబడదాం అనుకున్నా వాళ్ళ జాబితాను  పరిశీలించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టేట్ సెక్రటరీ, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు, రాజన్న రమేష్ కుమార్, రూరల్ ప్రెసిడెంట్ సన్యాసినాయుడు, టౌన్ ప్రధాన కార్యదర్శి ఆడారి ఆదిమూర్తి, ఎక్స్ కౌన్సిలర్ రామకృష్ణ, అధికార ప్రతినిధి దాడి రమేష్, రాంబిల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ లాలం భరత్, టౌన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కొటారు సాంబ, రాజన సూర్య నాగేశ్వరరావు, ఆడారి రమణ బాబుగారు, క్లస్టర్ ఇంచార్జ్ బొద్దపు శ్రీనివాసరావు, కర్ణం రవికుమార్, ఆడారి సన్యాసినాయుడు, తెలుగు యువత అధ్యక్షులు నమ్మి రమణ, దంట్ల వెంకటస్వామి, బీసెట్టి చిన్నారావు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, వార్డు ప్రెసిడెంట్లు, జిఎస్ లు, ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter