(JJM) 2.0 కింద చీపురుపల్లికి రూ.4.84 కోట్ల తాగునీటి నిధులు.. !

(JJM) 2.0 కింద చీపురుపల్లికి రూ.4.84 కోట్ల తాగునీటి నిధులు.. !

16/September/2026 19:13    Share:   

చీపురుపల్లి: నియోజకవర్గంలో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.4.84 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు. జల జీవన్ మిషన్ (JJM) 2.0 కింద ఈ నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఈ నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైన పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన, నమ్మకమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్,మందపాటి సూర్యనారాయణ రాజు
Breaking News

Subscribe our Newsletter