కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ నందలి 48 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానములకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను ఈనెల 11వ తేదీన ప్రచురించి, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు ప్రజల పరిశీలనార్ధము అందుబాటులో ఉంచడమైనదని జిల్లా పరిషత్ ఇంచార్జ్ సీఈఓ జి.వి.కె. మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము, 1994 నందలి పరిచ్చెదములు 11, 12 మరియు 179 నందలి 2వ నియమము ననుసరించి, ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ (ఓటర్ల జాబితా తయారి & ప్రచురణ) నియమములు, 2000 నందలి 7(2)వ నియమమును అనుసరించి, మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గము (ZPTCs) లకు 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తము, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్, విజయవాడ వారి నోటిఫికేషన్ నెం. 515/SEC-B1/2026, తేది 07-09-2026 ని అనుసరించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, జిల్లా ప్రజా పరిషత్ నందలి 48 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానములకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను ఈనెల 11వ తేదీన ప్రచురించి, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు ప్రజల పరిశీలనార్ధము అందుబాటులో ఉంచడమైనదని మల్లికార్జునరావు తెలియజేసారు.