కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు
ఏలూరు జిల్లా: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పోలీస్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిబ్బంది విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించేలా చూడాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సెల్‌ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు దూరంగా ఉండాలని తెలిపారు.“ముందుగా మనం పాటిద్దాం.. తరువాత ప్రజలకు చెప్పుదాం”అనే విధానంతో పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎస్పీ సూచించారు. హెల్మెట్ వినియోగం,రోడ్డు భద్రతపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని ఆదేశించారు.“మన భద్రత మన చేతుల్లోనే.. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి,కుటుంబాన్ని కాపాడండి” అని ఎస్పీ సందేశమిచ్చారు.