నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై అందించాలి.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ఏలూరు అర్బన్ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించి తహసిల్దార్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల తహసిల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతి పత్రాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో ఆకాశంలో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలను నేలకు దించి సామాన్యునికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్లు గడిచినప్పటికీ ధరలను తగ్గించకపోగా రకరకాల కారణాలతో విపరీతంగా పెంచుతున్నారని ఆరోపించారు.
నిత్యావసరాలతో పాటు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై ఆర్థికంగా భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని వేతనాలతో అస్తవ్యస్త ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలకు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మరింత ఇబ్బందులను కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, 16 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ డిపోల ద్వారా ప్రజలకు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో అధిక ధరలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా కేంద్రంలో నరేంద్ర మోడీ దేశ ప్రజలపై అధిక ధరల భారాన్ని వేస్తూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధిక ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ధరలను తగ్గించకపోగా రకరకాల కారణాలతో మరింతగా పెంచుతున్నారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్,గ్యాస్,నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఔషధాల ధరలను సైతం విపరీతంగా పెంచుకునేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడం ప్రజా వ్యతిరేక చర్యాని ఆరోపించారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఎదుర్కొంటున్న అధిక ధరల బారాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏఐటియుసి ఏలూరు జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు,ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సరైన ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. అధిక ధరలు వలన ప్రజలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,జి.స్వాతి, బళ్ల కనకదుర్గారావు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, రేఖ, ఎం.సత్యవతి, బాలిన ప్రసాద్,జిజ్జి వరపు సురేంద్ర, అమర్, కె.సురేష్, ఎస్.సోమేశ్వరరావు, వై.శ్రీనివాసు, ఎం.మహేష్, జి.ఈశ్వరరావు,సాయి,జి. అప్పారావు,తదితరులు