పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026లో ఏలూరు క్రీడాకారుల సత్తా..

పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026లో ఏలూరు క్రీడాకారుల సత్తా..

08/September/2026 19:44    Share:   

308 పతకాలు సాధించిన క్రీడాకారులకు ఘన సన్మానం  అభినందించిన రేంజ్ ఐజీ శ్రీ జి వి జి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  01.09.2026  నుంచి 04.09.2026 వ తేదీ వరకు VIT మంగళగిరి యూనివర్సిటీ లో నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్‌లో  పోలీస్ స్పోర్ట్స్ మీట్.2026లో ఏలూరు రేంజ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 308 పతకాలను సాధించారు.
ఈ నేపథ్యంలో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించేందుకు 08.09.2026న ఏలూరు అమీనా పేటలోని శ్రీ సురేష్ చంద్ర బహుగుణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణం లోని పోలీస్ కళ్యాణ మండపంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ వై. ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరై, పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.
308 పతకాలతో ఏలూరు రేంజ్ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్.2026లో ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారులు
➡️ 119 గోల్డ్ మెడల్స్
➡️ 116 సిల్వర్ మెడల్స్
➡️ 73 బ్రాంజ్ మెడల్స్
సాధించి మొత్తం 308 పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ సందర్భంగా పతకాలు సాధించిన ప్రతి క్రీడాకారులను రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు అభినందించి, వారి కృషి, పట్టుదల, ప్రతిభను ప్రశంసించారు.
క్రీడలు పోలీసు సిబ్బందిలో ఉత్తేజం, చురుకుదనాన్ని పెంచుతాయి అని ఐజీ గారు వెల్లడి.
ఈ సందర్భంగా రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై విధులు నిర్వహిస్తూ ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో క్రీడలు పోలీసు సిబ్బందిలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, ఉత్తేజం, చురుకుదనం పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా సిబ్బందిలో క్రమశిక్షణ, పట్టుదల, సమయస్ఫూర్తి, పోటీ తత్వం, జట్టు స్ఫూర్తి వంటి లక్షణాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.
పోలీస్ విధుల్లో చూపించే నిబద్ధతతో పాటు క్రీడా రంగంలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఏలూరు రేంజ్‌కు మంచి పేరు తీసుకువచ్చిన క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
క్రీడలతో వృత్తి నైపుణ్యం మరింత మెరుగవుతుంది అని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు వెల్లడి
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది ఒకే వేదికపై క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం, స్నేహభావం, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు.
క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, పోలీసు విధుల్లో అత్యంత అవసరమైన చురుకుదనం, సమయస్ఫూర్తి, ఏకాగ్రత, మానసిక స్థైర్యం, నిర్ణయ సామర్థ్యం వంటి లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసు సిబ్బందికి క్రీడలు శారీరకంగా, మానసికంగా పునరుత్తేజాన్ని అందించడంతో పాటు వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు దోహదపడతాయని ఎస్పీ గారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026లో ఏలూరు రేంజ్ తరఫున పాల్గొని వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
పతకాలు సాధించిన ప్రతి క్రీడాకారుడికి అభినందనలు
క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా పోలీసు సిబ్బంది తమ ప్రతిభను వెలికితీయడంతో పాటు శాఖకు, జిల్లాకు, రేంజ్‌కు గౌరవాన్ని తీసుకువస్తారని అధికారులు పేర్కొన్నారు.
308 పతకాలు సాధించడం ఏలూరు రేంజ్ పోలీస్ క్రీడాకారుల ప్రతిభ, కృషి, క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనమని తెలిపారు.
భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంతో క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని అధికారులు ఆకాంక్షించారు.
క్రీడల్లో విజయం కేవలం పతకంతో కొలవబడదు. క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి, గెలవాలనే సంకల్పంతో నిర్మితమయ్యే వ్యక్తిత్వమే అసలైన విజయం.
ఈ కార్యక్రమంలో డిసిపి సి ఎస్ డబ్ల్యు విజయవాడ బి  సత్యనారాయణ గారు అదనపు ఎస్పీ కాకినాడ ఏఆర్ డి ఎస్ పి ఎస్ శ్రీనివాసరావు గారు ఏఆర్ డిఎస్పి కాకినాడ శ్రీ శ్రీ హరిరావు గారు  మెడల్స్ పొందిన పోలీస్ అధికారులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter