ఆర్టీసీ పరిరక్షణకు ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరసన దీక్షలు..

ఆర్టీసీ పరిరక్షణకు ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరసన దీక్షలు..

08/September/2026 19:41    Share:   

– సీఐటీయూ, పలు సంఘాల మద్దతు
అనకాపల్లి:
ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని, పినాకిల్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, నెల్లూరు-2 డిపో పరిరక్షణకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఎస్‌డబ్ల్యూఎఫ్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలను ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీఎన్‌వీ పరమేశ్వరరావు ప్రారంభించారు. ఎస్‌డబ్ల్యూఎఫ్‌ నాయకులు బత్తిన అప్పారావు, ఎస్‌ఆర్‌ త్రిమూర్తులు, ఎంపీ నాయుడు, ఈఎస్‌ రావు దీక్షలో పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వీవీ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. పినాకిల్‌ సంస్థ ద్వారా 1,050 ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపే ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి, ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని కోరారు. ఇప్పటికే నాలుగు డిపోలను దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.నెల్లూరు-2 డిపో పరిరక్షణ కోసం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఆధ్వర్యంలో 212 రోజులుగా నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోకపోతే కార్మికులు, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్‌, అనకాపల్లి మండల కన్వీనర్‌ కాళ్ల తాలయ్య బాబు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు బొప్పే ఉమామహేశ్వరరావు, పెంటకోట శ్రీనివాసరావు, అల్లు రాజు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుల
Breaking News

Subscribe our Newsletter