..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఏలూరులో పేదలకు చిన్న సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించాలి, ప్రజల్లోకి నడిచే నాయకులకే ప్రాముఖ్యత ఇవ్వాలి, ప్రజలతో నిత్యం మమేకమై వారి బాధలు తెలిసిన వారే నిజమైన నాయకుడు అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు.. స్థానిక పోణంగి రోడ్డులోని విఎన్ఆర్ గ్రాండ్ సిటీ వద్ద 13వ డివిజన్ ఇంచార్జి కోయ సత్యనారాయణ (సత్తిబాబు) గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయానికి శనివారం ప్రారంభోత్సవం జరిగింది.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు.. తొలుత ఆయనకు డివిజన్ సైనికులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి 13వ డివిజన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు కోయ సత్తిబాబు గారి ఆధ్వర్యంలో 13వ డివిజన్ లో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు.. స్థానిక ప్రజలు తమ సమస్యలను, ముఖ్యంగా అర్హత ఉన్న సంక్షేమ పథకాల అందుబాటులో లోపాలు, ఆయా ఏరియాల్లో మౌలిక వసతుల సమస్యలను, మా నాయకుల దృష్టికి తీసుకురావచ్చు అన్నారు.. రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో చర్చించి, స్పష్టమైన పరిష్కార మార్గాలను చూపుతామని పేర్కొన్నారు.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏలూరులోనూ కూటమి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.. అలాగే ఈరోజు ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం శుభపరిణామంగా భావిస్తున్నామన్నారు.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెను మార్పు కోసం, రాజకీయాల్లో అవినీతి నిర్మూలన చేయాలన్న, ఆలోచన విధానాలతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ అన్నారు.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన జనసైనికులు వీర మహిళలు అందరి పైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నగర గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, పొలిమేర దాసు, ఎట్రించి ధర్మేంద్ర, బొండా రాము నాయుడు, కొనికి మహేష్, వాసా సాయి, అగ్గాల శ్రీనివాస్, కూనిశెట్టి మురళీ కృష్ణ, లక్కింశెట్టి కిరణ్ కుమార్, పైడి లక్ష్మణరావు, నూకల సాయి ప్రసాద్, కంభంపాటి రామ్మోహన్ రావు, జనసేన నాయకురాలు వెలగా గాయత్రీ, యడ్లపల్లి మమతా, దుర్గ బీబీ, స్థానిక నాయకులు, తోట రాజేష్, అన్నవరం, గోళ్ళ సతీష్, రమేష్, గాదె అశోక్ కుమార్, చల్లగాలి చిట్టిబాబు, షణ్ముగం, రాజ్ కుమార్, మహేష్, గణేష్, పయ్యావుల ప్రవీణ్, మణి, కిషోర్, బాలు, విష్ణు, నాగు, సురేష్, విక్రమ్, చందు, సాయి, షఫీ, వంశీ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.