జలహారతికి భారీగా తరలివెళ్లిన టిడిపి శ్రేణులు..

జలహారతికి భారీగా తరలివెళ్లిన టిడిపి శ్రేణులు..

02/September/2026 20:26    Share:   

​యలమంచిలి : అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించే గోదావరి జలాల ‘జలహారతి’ కార్యక్రమానికి యలమంచిలి పట్టణం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు అగ్రహారం, వెంకటాపురం గ్రామాల నుంచి పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ (నానాజీ) నాయకత్వంలో ప్రత్యేక వాహనాల్లో పాయకరావుపేటకు బయలుదేరారు. ​ఈ కార్యక్రమంలో వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శ్రేణులంతా ఉత్సాహంతో పాయకరావుపేటకు తరలివెళ్లినట్లు నాయకులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter