సెప్టెంబర్,12వ తేదీన ఏలూరులో మెగా జాబ్ మేళా..

సెప్టెంబర్,12వ తేదీన ఏలూరులో మెగా జాబ్ మేళా..

31/August/2026 19:47    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు,ఏలూరు జిల్లా

జిల్లాలో 800 మంది నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు సెప్టెంబర్,12వ తేదీన ఏలూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పై జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్.జితేంద్ర బాబుతో కలెక్టర్ చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని గ్రీన్  టెక్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో  800 మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ఏలూరులో ఈనెల 12వ తేదీన ప్రత్యేక  జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు.సదరు ఉద్యోగ మేళాకు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు డిపార్ట్మెంట్ కౌశలం (kaushalam)కార్యక్రమం ద్వారా నిర్వహించే పరీక్షల్లో ఉత్తిర్ణులు అయిన 2303 మంది నిరుద్యోగ యువతీ యువకులతో పాటు అర్హత కలిగిన ఎవరైననూ పాల్గొనవచ్చన్నారు.ఈ విషయం పై జిల్లాలోని అందరు మునిసిపల్ కమీషనర్లు,ఎంపీడీఓ లతో పాటు స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డ్ సచివాలయాల  సిబ్బంది అత్యధిక ప్రాధాన్యత నిచ్చి షార్ట్ లిస్ట్ చేయబడిన మొత్తం 2303 అభ్యర్థులతో బాటు అర్హతలున్న ఇతర నిరుద్యోగ యువతీ యువకులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టర్  డా.యం.జె.అభిషేక్ గౌడ,అసిస్టెంటు కలెక్టర్ సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి యన్.జితేంద్ర బాబు,స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు జిల్లా అధికారి జి.వెంకట నాయుడు,వివిధ శాఖలు అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter