క్రైమ్ అనాల్సిస్ | స్పెషల్ రిపోర్టర్ - టివియస్ ప్రకాష్ :
యలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద నున్న, మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రారంభమై 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, సేవా స్ఫూర్తిని చాటుతూ మహా సిమెంట్ ఫ్యాక్టరీ కుటుంబ సభ్యులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహా సిమెంట్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్లాంట్ హెడ్ బి. రామస్వామి, పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఎల్. శ్రీనివాసరావు, సీఎస్ఓ డి. వెంకట్రావు, తో కలిసి ఉద్యోగులు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌కు రక్తదానం చేశారు.
మై హోమ్ ఇండస్ట్రీస్ 19వ వార్షికోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ప్రాణాలను కాపాడే మహోన్నత రక్తదానం ద్వారా జరుపుకోవడం సంస్థ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్తదాతలను సంస్థ ప్రతినిధులు అభినందించారు. “రక్తదానం.. ప్రాణదానం” అనే సందేశాన్ని సమాజానికి చాటుతూ, మై హోమ్ ఇండస్ట్రీస్ 19వ వార్షికోత్సవ వేడుకలు సేవా భావంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.