క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
మామిడివాడ–01: విశాఖ డెయిరీ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో కష్టపడి పాల ఉత్పత్తిని పెంచుతున్న పాడి రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో హెల్త్ కార్డులు, ఇత్తడి బిందెల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పాడి రైతుల సంక్షేమం, అభివృద్ధి, వారి కృషికి గుర్తింపుగా నిర్వహించిన ఈ కార్యక్రమం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. పాల ఉత్పత్తి పెంపునకు రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్‌వైజర్ గణేష్, పాల సంఘం అధ్యక్షుడు పప్పల కోటేశ్వరరావు, వేతన కార్యదర్శి కరెడ్ల నాగరాజు, మాజీ పాల సంఘం అధ్యక్షుడు కరెడ్ల రమణ, నెట్టెం శ్రీనివాసరావు, సహాయకుడు నక్కపల్లి అప్పారావు, తేటకవి వెంకట సూర్య ప్రకాష్, వైఎస్సార్సీపీ నాయకుడు మోటూరు రాఘవేంద్ర, పాలకవర్గ సభ్యులు, పలువురు పాడి రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాడి రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
రైతు సంక్షేమమే లక్ష్యం.. పాడి రైతుల అభివృద్ధే ధ్యేయం.. పాల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహమే మా బాధ్యతని అన్నారు, విశాఖ డైయిరి మేనేజర్ శ్రీనివాసరావు.