అనకాపల్లి, ఆగస్టు 22:
అనకాపల్లి జిల్లాను దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లను నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.అనకాపల్లి ఇక బెల్లం మార్కెట్‌కే పరిమితం కాకుండా స్టీల్, ఫార్మా, అల్యూమినియం, డేటా సెంటర్లతో పారిశ్రామిక హబ్‌గా ఎదగనుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, భవిష్యత్‌లో AI రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.పరిశ్రమల అభివృద్ధితో పాటు పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ పంచాయతీగా తీర్చిదిద్దాలని, ప్రతి ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్‌ను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.నీరు, పరిశ్రమలు, పెట్టుబడులు, సాంకేతికత, స్వచ్ఛతకు సమాన ప్రాధాన్యం ఇస్తూ అనకాపల్లిని అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
శ్రీనివాసరావు అప్పికొండ.జిల్లా ఇన్చార్జి,క్రైమ్ ఎనాలిసిస్,