కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ 82 వ జన్మ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు గారు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్ మోహన్ రావు గారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేశారని ఢిల్లీ నుంచి నేరుగా గ్రామస్థాయికి పంచాయితీకి నిధులు కేటాయించారని , నగర పాలక బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు బీసీలకు స్థానిక సంస్థలలో 33% రిజర్వేషన్ కల్పించారని యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి భాగస్వామ్యం చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు కొనియాడారు జిల్లా రాజీవ్ గాంధీ అభియాన్ అధ్యక్షులు మంతెన నరసింహారావు ఏలూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ ఏలూరు సిటీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బురదగుంట లివిన్ క్రిస్టియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండు బోయిన చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనుకోజు శ్రీనివాసరావు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌడు రంగబాబు కొమ్మన సాంబశివరావు బురదగుంట క్రాంతి దాసరి రాంప్రసాద్ పులి మార్కండేయులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెద్దిరెడ్డి పద్మ సేవాదళ్ సుబ్బారావు సుమారుగా 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం స్వీట్లు పంచి పెట్టినారు.