కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఈరోజు అమరావతిలోని సచివాలయం నందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.. తూర్పు కాపు రిజర్వేషన్ సమస్యల పరిష్కారానికై వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా తూర్పు కాపు వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభ్యర్థనలపై సవివరంగా చర్చించారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని మంత్రి శ్రీ నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు..