యలమంచిలిలో సద్భావన దివస్ పురస్కారంగా న్యాయ అవగాహన సదస్సు..

యలమంచిలిలో సద్భావన దివస్ పురస్కారంగా న్యాయ అవగాహన సదస్సు..

20/August/2026 20:14    Share:   

యలమంచిలి: సద్భావన దివస్ పురస్కరించుకొని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో యలమంచిలిలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కె. రమేష్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమే మన భారతీయ సంస్కృతికి మూలమని, అదే మన దేశానికి ప్రధాన బలమని అన్నారు. కులం, మతం, ప్రాంతీయ, భాషా భేదాలను పక్కనపెట్టి ప్రజలందరి మధ్య మత సామరస్యాన్ని, జాతీయ సమగ్రతను పెంపొందించడమే ఈ సద్భావన దివస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎటువంటి హింసకు తావు లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ శాంతియుత సహజీవనం సాగించేలా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో గ్రామాల్లో తలెత్తే పగలు, ప్రతీకారాలు, చిన్న చిన్న విభేదాలను న్యాయస్థానాల వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని, వాటిని విభేదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter