బ్రాండ్ ఎక్స్ యాజమాన్యం మహిళా కార్మిక కుటుంబాలకు పరిహారం అందించాలి..

బ్రాండ్ ఎక్స్ యాజమాన్యం మహిళా కార్మిక కుటుంబాలకు పరిహారం అందించాలి..

20/August/2026 20:00    Share:   

యలమంచిలి
మోసయ్యపేట, ఆగస్టు 20:
 యలమంచిలి, మోసయ్యపేట, కొత్త మోసయ్యపేట, చోడపల్లి గ్రామాలకు చెందిన మహిళా కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఎసి వాహనం గత నెలలో చెట్టుకు ఢీకొని తీవ్రంగా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మహిళా కార్మికులను సిఐటియు నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ పొంది ఇంటికి వెళ్లిన వారిని, ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని నేతలు పరామర్శించారు. వైద్య సేవలు అందినప్పటికీ కుటుంబాన్ని గడపడం చాలా కష్టంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముచ్చు నాగమణి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చినా మక్క విరిగిపోవడంతో లేవనే పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ముచ్చు రామలక్ష్మి, కొండపల్లి చౌడమ్మ, శెట్టి లక్ష్మి నెలరోజులుగా ఆసుపత్రిలోనే వైద్యం పొందుతున్నారు.
వీటితోపాటు వారి పిల్లలు ఆసుపత్రిలో పేషెంట్లను చూసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు పేర్కొన్నారు. వైద్యంతోపాటు మహిళా కార్మిక కుటుంబాలకు పరిహారం అందించి మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమ యాజమాన్యంపై ఉందని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు.
తక్షణమే మహిళా కార్మికుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా కోలుకునేంతవరకు సెలవులతో కూడిన వేతనం, పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. అదే విధంగా తక్షణ చర్యలు తీసుకొని భరోసా కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.రాము, మోసయ్యపేట ఉపసర్పంచ్ పుర్రె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter