KGBV పాఠశాలలో విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం..

KGBV పాఠశాలలో విద్యా హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం..

18/August/2026 20:19    Share:   

తిమ్మరాజుపేట (ఎస్.రాయవరం): జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఎస్.రాయవరం మండలం తిమ్మరాజుపేట గ్రామంలోని KGBV పాఠశాలలో "విద్యా హక్కు చట్టం"పై ఉపాధ్యాయులు మరియు పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి ఎన్. సూర్యలక్ష్మి మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలకు 25 శాతం రిజర్వేషన్ కల్పించాలని, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్యను అందించాలని తెలిపారు. అలాగే లింగ వివక్షతను నివారించడం, నాణ్యమైన విద్య మరియు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అంశాలను వివరించారు.
కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎమ్. రమేష్ మాట్లాడుతూ, పిల్లల హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడితే వెంటనే 24 గంటల పాటు అందుబాటులో ఉండే చైల్డ్ లైన్ 1098 నంబరును, మహిళలు మరియు ఆడపిల్లలకు సంబంధించిన విషయాలకు 181 ఉచిత నంబరును సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బాలల రక్షణ అధికారి కె.ఎల్. మనోహర్, సూపర్వైజర్లు కె.లలిత, ఉన్నీషా బేగం, కనకదుర్గ, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ మంజులవాణి, KGBV ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, మహిళా సంరక్షణ కార్యదర్శి లోకిత, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, అంబేడ్కర్ మరియు KGBV సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter