యలమంచిలి లో టైక్వాండో క్రీడాకారులకు బంగారు, రజత పతకాలు..

యలమంచిలి లో టైక్వాండో క్రీడాకారులకు బంగారు, రజత పతకాలు..

17/August/2026 09:19    Share:   

యలమంచిలి
అనకాపల్లి జిల్లా టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం యలమంచిలి కొత్తపేట రామాలయం పార్కులో ఉత్సాహంగా జరిగాయి. కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. ఏజీపీ రాజాన గోవిందరావు మాట్లాడుతూ టైక్వాండో  క్రీడల వలన విద్యార్థులలో క్రమశిక్షణ శారీరక దారుఢ్యం, ఆత్మ రక్షణ వంటివి ఆలబడతాయని అన్నారు. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లా లోని పలు టైక్వాండో క్లబ్బుల నుంచి 105 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 38 మంది బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో13 మంది  బాలికలు కాగా 25 మంది బాలురు ఉన్నారు. 11 మంది బాలురు ముగ్గురు బాలికలు రజిత పథకాలు సాధించారు.8 మంది బాలురు కాంగ్రెస్ పథకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన విజేతలు ఈనెల 21వ తేదీన శ్రీకాకుళంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తైక్వాండో కార్యదర్శి నగరి. సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాయవరపు. సుధాకర్,
యలమంచిలి న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు  ద్వారపరెడ్డి. వెంకటరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్వి. రామకృష్ణ, స్పోర్ట్స్ కార్యదర్శి వేముశెట్టి. కృష్ణ, పోలిశెట్టి.వీర ప్రజానాయక్ , కూనిశెట్టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter