
అనకాపల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రింగ్ రోడ్డులో ఘనంగా సైకిల్ ర్యాలీని నిర్వహించారు.
ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ఈ ర్యాలీను నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కేటింగ్ పిల్లలు చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్య అతిథులు:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్, మాజీ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ పాల్గొన్నారు. జిల్లా జేసీ, APUFIDC చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, గవర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్ల సురేంద్ర, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ బుద్ధ నాగ జగదీష్, జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ మార్గం:
రింగ్ రోడ్డు జంక్షన్, పెరుగు బజార్ మీదుగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ప్రసంగం:
ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని అన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ఐక్యంగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ అప్పికొండ