22ఏ భూ సమస్యలపై సీఎస్ సమీక్ష — కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ !

22ఏ భూ సమస్యలపై సీఎస్ సమీక్ష — కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ !

12/August/2026 20:24    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, 

జిల్లాలో గత నెలరోజులలో 22ఏ జాబితా నుండి తొలగింపునకు 434 అర్జీలు అండగా 167 అర్జీలు పరిష్కరించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కి  చెప్పారు.  22ఏ భూ సమస్యల పరిష్కారం,రీసర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ వన్, పిజిఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం,  తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి సిఎస్ సాయిప్రసాద్ రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.     ఈ సందర్భంగా సిఎస్ సాయిప్రసాద్  మాట్లాడుతూ  22ఏ జాబితా నుండి తొలగింపునకు అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలమేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను కారణాలను అర్జీదారులకు  తెలియజేస్తూ తిప్పిపంపాలన్నారు.  పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు.  ఆగష్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని నూరుశాతం పూర్తిచేయాలన్నారు.    రైతుల ఈకెవైసి పూర్తిచేసి, రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్, తదితర వివరాలను పరిశీలించి తప్పులు లేకుండా తదుపరి నెలలో పంపిణీ చేయవలసిన   పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. 
          
          ఏలూరు జిల్లా కలెక్టరేట్  నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో చేపట్టిన చర్యలు గురించి సిఎస్ సాయిప్రసాద్ కి  వివరించారు. 22ఏ జాబితా నుండి తొలగింపునకు 434 అర్జీలు అందగా 167 అర్జీలు పరిష్కరించామని నిబంధనల మేరకు లేని 153 అర్జీలను తిరస్కరించామని, మిగిలిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.   ఆగష్టు నెలలో జిల్లాలో 26 గ్రామాలలకు సంబంధించి 13 వేల  668  పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యానికిగాను 13 వేల  666 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.  పిజిఆర్ఎస్ ద్వారా గత రెండు నెలలో 1673 అర్జీలు అండగా, 1672 అర్జీలు పరిష్కరించామని కలెక్టర్  సిఎస్ కి తెలియజేసారు.

         జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ,  డిఆర్ఓ ఏమి. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ,  ప్రభృతులు పాల్గొన్నారు.,  తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుండి మంగళవారం రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమీషనర్ జి. జయలక్ష్మి తో కలిసి సిఎస్ సాయిప్రసాద్ రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో  జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.     ఈ సందర్భంగా సిఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ  22ఏ జాబితా నుండి తొలగింపునకు అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలమేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను కారణాలను అర్జీదారులకు  తెలియజేస్తూ తిప్పిపంపాలన్నారు.  పిజిఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు.  ఆగష్టు నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని నూరుశాతం పూర్తిచేయాలన్నారు.    రైతుల ఈకెవైసి పూర్తిచేసి, రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం, సర్వే నెంబర్, తదితర వివరాలను పరిశీలించి తప్పులు లేకుండా తదుపరి నెలలో పంపిణీ చేయవలసిన   పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. 
ఏలూరు జిల్లా కలెక్టరేట్  నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో చేపట్టిన చర్యలు గురించి సిఎస్ సాయిప్రసాద్ కి వివరించారు. 22ఏ జాబితా నుండి తొలగింపునకు 434 అర్జీలు అందగా 167 అర్జీలు పరిష్కరించామని నిబంధనల మేరకు లేని 153 అర్జీలను తిరస్కరించామని, మిగిలిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.   ఆగష్టు నెలలో జిల్లాలో 26 గ్రామాలలకు సంబంధించి 13 వేల  668  పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యానికిగాను 13 వేల  666 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.  పిజిఆర్ఎస్ ద్వారా గత రెండు నెలలో 1673 అర్జీలు అండగా, 1672 అర్జీలు పరిష్కరించామని కలెక్టర్ సిఎస్ కి తెలియజేసారు.జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ,  డిఆర్ఓ ఏమి. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ,  ప్రభృతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter