
అనకాపల్లి, ఆగస్టు 11:
అనకాపల్లి జిల్లా శారదా నగర్‌లోని హనుమాన్ దేవాలయంలో శ్రీ హనుమాన్ సేవా సమితి అనే ఆధ్యాత్మిక సంస్థను అధికారికంగా ప్రారంభించారు. భక్తులకు, ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మట్టి గణపతి ప్రచారకర్త, వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవ కమిటీవ్యవస్థాపకులు శ్రీ ఆడారి కుమారస్వామి మాట్లాడుతూ, హనుమంతుడు శ్రీరాముడి విశ్వాస బంటు అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా భజనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమాజానికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని పేర్కొన్నారు.అనకాపల్లిలో ప్రతి సంవత్సరం ఐదువేల మంది భక్తులతో హనుమాన్ శోభాయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.ఈ సంస్థకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఆళ్ళ ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. భక్తుల సూచనలు, సలహాల మేరకు మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయనకు పూర్తి అధికారం ఇవ్వబడింది.డైరెక్టర్లుగా దాడి భాను అనిల్, సబ్బిశెట్టి వెంకట్ రాజు, బుద్ధ జగన్మోహన్, కుంచా చిన్ను, పరి సురేష్, తలాడ కిరణ్, విన్నకోట నీలేష్ గుప్తా, చీర శ్రీను యాదవ్, సూరంపూడి హేమ పవన్ కిరణ్, కసివల్లి కార్తీక్ తదితరులు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, 12 సంవత్సరాల క్రితం ఆడారి కుమారస్వామి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం సేవా సంఘం స్థాపించబడి విజయవంతంగా కొనసాగుతోందని, అదే విధంగా ఈ కొత్త సంస్థ కూడా ఆధ్యాత్మిక భావంతో ప్రజలకు సహకారంగా నిలుస్తుందని తెలిపారు.