ధాబాలలో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: అచ్యుతాపురం పోలీసులు 

ధాబాలలో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: అచ్యుతాపురం పోలీసులు 

09/August/2026 08:05    Share:   

అచ్యుతాపురం,
అచ్యుతాపురం మండల పరిధిలోని ధాబా యజమానులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.చంద్రశేఖర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సైలు సుధాకర్, పోషణ గౌరీలతో పాటు మండల పరిధిలోని 7 ధాబాల యజమానులు పాల్గొన్నారు.​ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ధాబాలలో అక్రమంగా మద్యం విక్రయించినా లేదా మద్యం సేవించడానికి అనుమతించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాబాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా యజమానులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.మద్యం నిషేధం: ధాబాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు జరపరాదు, మద్యం సేవించేందుకు వినియోగదారులను అనుమతించకూడదు.ట్రాఫిక్ నియంత్రణ: ధాబాల ముందు రోడ్లపై లారీలు, ఇతర వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా యజమానులు చర్యలు తీసుకోవాలి.శాంతిభద్రతల పరిరక్షణ: ధాబాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు  విఘాతం కలిగిస్తే సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ధాబా వద్ద తప్పనిసరిగా సిసి టివి (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.​ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ తనిఖీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే ధాబాలను సీజ్ చేయడానికి కూడా వెనుకాడమని పోలీసులు స్పష్టం చేశారు.
Breaking News

Subscribe our Newsletter