శ్రీకన్య జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన..

శ్రీకన్య జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన..

08/August/2026 20:21    Share:   

అనకాపల్లి,
అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుహిన్ సిన్హా గారి మరియు ఎస్.డి.పి.ఓ అనకాపల్లి వారి ఉత్తర్వుల మేరకు, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకట నారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీకన్య జూనియర్ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు మరియు రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు. విద్యార్థులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్ ఉపయోగించకుండా ఉండటం, అతివేగంతో వాహనాలు నడపకుండా ఉండటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండటం మరియు మైనర్లు వాహనాలు నడపకుండా ఉండటం వంటి అంశాలపై వివరంగా వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట నారాయణ గారు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రహదారి ప్రమాదాలను నివారించవచ్చని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను తమ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు తెలియజేసి, సురక్షితమైన రహదారి సంస్కృతిని ప్రోత్సహించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter