
అనకాపల్లి
సీనియర్ జర్నలిస్ట్ గంట గోవింద్
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఫిబ్రవరి17 : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శాప్ లీగ్ చెస్ టోర్నమెంట్ పోటీలను అనకాపల్లి ఎన్.టి.ఆర్ స్టేడియం లో విజయవంతం గా నిర్వహించడం జరిగింది అని, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బాల బాలికలు ఎక్కువ మంది పాల్గొన్నారు. బాలురు అండర్ -13 లో 25 మంది, బాలికలు అండర్ -13 లో 10 మంది, బాలురు అండర్ -15 లో 27 మంది, బాలికలు అండర్ -15 లో 11 మంది, బాలురు అండర్ -17 లో 7 మంది మరియు బాలురు అండర్ -19 లో 2 చొప్పున పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన విజేతలు తిరుపతి లో జరిగే రాష్ట్ర స్తాయి పోటీలలో 21.02.2026 & 22.02.2026 తేదీలలో జరుగు శాఫ్ లీగ్ చెస్ టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఇందులో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీమతి పూజారి శైలజ గారు, SGF సెక్రటరీ శ్రీ కే.ఎం.ఎల్ నాయుడు గారు, శ్రీ మోటూరి నాగేశ్వర రావు గారు, చెస్ ఆర్పిటరీ శ్రీ సుదీర్ గారు మరియు ఇతర PET లు, శాప్ కోచ్ లు మరియు స్టాఫ్ పాల్గొన్నారు.
తేదీ 24.02.2026 న శాప్ లీగ్ సైకిల్ బోర్మెంట్ cum సెలెక్షన్స్‌ను సుంకరమెట్లు నుండి దేవీపురం, అనకాపల్లి సర్వీస్ రోడ్ మీదుగా జరుగును . కావున ఆసక్తి గల బాలురు మరియు బాలికలు అండర్ -18 విభాగం లో క్రీడా యాప్ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవాల్సింది గా కోరుతున్నాము. ఈ క్రింది లింక్ ద్వారా "https://sports.ap.gov.in/#/home/sl/sl-index" రిజిస్టేషన్ చేసుకోవలెను.